RAMESH POTHARAJU:
తెలంగాణ : ఏదైనా తెగేదాకా లాగొద్దు అంటాం కదా కానీ ప్రభుత్వాలు మాత్రం తెగేదాకా లాగుతాం, మళ్ళీ ముడివేస్తాం అన్నట్లు వ్యవహరిస్తాయి. వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాల మీదకు వచ్చేదాకా కొన్ని పనులు పూర్తి చేయరు. కొన్ని ఎన్నికలు వచ్చేదాకా , మరికొన్ని ప్రజలు సచ్చేదాక , ఇంకొన్ని ప్రజలు తిరగబడేదాక , ఇంకా కొన్ని అయితే వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ది చేకూరినంత కాలం హామీలు ఇచ్చేందుకు వాడుకుంటారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న వంతెనల విషయంలోనూ జరుగుతోంది , వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే తెగేందుకు సిద్ధంగా ఉన్న వంతెనలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి , పూర్తిగా కొట్టుకుపోయిందా సరే , ఓ కాంట్రాక్టరు , స్థానిక నాయకుడు బ్రతికినట్లే అదీ ఓ నాలుగు అయిదు యేండ్లు కావాలి పూర్తిచేయడానికి , అదే పాక్షికంగా కొట్టుకుపోయిందో ,, మళ్ళీ దగ్గర్లో ఏవైనా ఎన్నికలు ఉంటె పనికొస్తుంది.
ఇప్పటికీ ఒకటి రెండు వర్షాలు పడితేనే వేరే గ్రామాలతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు వేలల్లో ఉన్నాయంటే నమ్మాల్సిందే మరి. మనకు ఏం కావాలో ఎప్పుడు కావాలో తెలుసుకుని పోరాడటం ప్రజలు నేర్చుకోనంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు రాదు .


