The Trouble Maker Harish Rao

రాష్ట్రంలో సంచలనంగా మారిన The Naked Truth పేరుతో Big Tv లో వచ్చిన కథనం.
మేడిపండు చూడు మేలిమైయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా హరీష్ రావ్ వ్యవహారం ఉంటుంది అంటున్న స్థానికులు.
మేకవన్నె పులి అని, అభివృద్ధి మాటున అకృత్యాలు ఎన్నో చేసారు అంటున్నారు.
రంగుల కోటలా కనిపించే సిద్దిపేట వెనక హరీష్ రావ్ చీకటి కోణం ఎంతో ఉందంటున్నారు సిద్దిపేట ప్రజలు
బతకనీకి వచ్చినోడు మా బతుకులు ఆగం చేసిండని ఆవేదన వెళ్ళగక్కారు
Yudhishthira Vaartha:
సిద్దిపేట లో నిర్మించిన రంగనాయక్ సాగర్ భూ సేకరణలో హరీష్ రావ్ తన అతి తెలివి ఉపయోగించి ఎన్నో ఎకరాల భూమి ఖాజేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి…… ప్రాజెక్టు పేరిట ఇరిగేషన్ వారు రైతుల నుండి సేకరించి భూమి హరీష్ రావ్ దొంగ దారిలో కాజేసి ఏమీ తెలియనట్టు… విషయం తన మీదికి రాకుండా SUDA అభివృద్ధి పనుల పేరిట డ్రామాలు ఆడినట్టు తెలుస్తోంది..

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హరీష్ రావ్ భాగోతం అంతా బట్టబయలు అవుతుండటంతో ఆందోళన చెందిన హరీష్ రావ్.. కొత్త కుట్రలకు తెరలేపినట్టు సమాచారం…
TV లో వస్తున్న కథనాలు ప్రజలు చూడకుండా సిద్దిపేట పరిసర ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో సైతం కేబుల్ కట్ చేయించినట్లు సమాచారం…
అన్ని ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేసినప్పటికి హరీష్ రావ్ ఏదో ఫార్మాలిటీకి పరువునష్టం దావ వేయబోతున్నట్లు వినికిడి..
కాళేశ్వరం కాటుకు బలి అవుతాడేమో అనుకున్న హరీష్ రావ్… చిన్న చలి చీమకే చిక్కేలా ఉన్నాడు… ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇప్పుడు రంగనాయక్ సాగర్ లో భూ దోపిడీ లోనే ఇరుక్కుని కటకటాలు లెక్కపెట్టే అవకాశం ఉన్నట్టు ప్రజల్లో చర్చ మొదలైందట…

