ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి షెఫాలీ శరణ్

Yudhishthira Vaartha:
ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా ఈరోజు శ్రీమతి షెఫాలీ బి శరణ్ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన శ్రీ మనీష్ దేశాయ్ స్థానంలో శ్రీమతి షెఫాలీ శరణ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి శరణ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1990 బ్యాచ్ కి చెందిన అధికారి..
మూడు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌లో శ్రీమతి షెఫాలీ శరణ్ ఆర్థిక, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సమాచార మరియు ప్రసార వంటి మంత్రిత్వ శాఖలకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా సేవలు అందించి ఆయా శాఖల మీడియా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా కూడా శ్రీమతి షెఫాలీ శరణ్ పనిచేశారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (సాంప్రదాయ ఔషధాల విభాగం/ఆయుష్ (2002-2007)), ఆర్థిక మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ (ఆర్థిక వ్యవహారాల విభాగం 2013-2017)గా శ్రీమతి షెఫాలీ శరణ్ పనిచేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఇన్ఫర్మేషన్ పాలసీ, 2000-2002)లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా 2007 నుంచి 2008 వరకు లోక్‌సభ మంత్రిత్వ శాఖ, లోక్‌సభ టెలివిజన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా శ్రీమతి షెఫాలీ శరణ్ పనిచేశారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి శరణ్‌కి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

