CHANDLAPUR:
శిలాఫలకాలు ఏమో సువర్ణాక్షరాలతో..
సమస్యలేమో వర్ణనాతీతం… ఏంటి ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉంది కదా !
నిజమే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో మూగ జీవాల కోసం నిర్మించిన, షెడ్ల వెనక జరుగుతున్న అవినీతి పై దాదాపు 3 నెలల క్రితం రాసిన కథనంలో ని మాటలే..
గొర్రెల షెడ్డు కోసం నిర్మించిన షెడ్డు నాణ్యత లేక కూలిపోతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
ఇక మూడు నెలలు ఏంటి 3 సంవత్సరాలు గడిచినా మన అవినీతి నాయకులు, నిర్లక్ష్యపు అధికారులు ఉన్నంత కాలం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు గాక ఉండదు.
తాజాగా ఈ షెడ్ల వెనక నాణ్యత లోపమే కాకుండా, అవినీతి కోణం కూడా ఉందని సమాచారం… మన పందికొక్కులు ప్రభుత్వ నిధులు నొక్కేయడమే కాకుండా, ఒక్కో షెడ్డు లబ్దిదారుల వద్ద 10వేల రూపాయల వరకు దోచుకున్నట్టు సమాచారం.
ఈ అవినీతి సొమ్మును నిధిలా ఏర్పాటు చేసి ఏ ప్రతినిధి ఇంట్లో దాస్తున్నారో మరి..?
ఇంత జరుగుతున్నా గౌరవ APO గారు అయితే నా కంటికేమి కనబడలేదు అనడం వెనక ఆయనకు ఎంత కలుగుతుందో మరి..
MPDO గారైతే శిలావిగ్రహం లా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అంతేలేండి ఆయనగారి నియోజకవర్గంలో, అయ్యగారి ఇలాఖాలో అధికారులంతా కేవలం ఉఛ్వాస నిఛ్వాసలు గల శిలా విగ్రహాలే మరి.


