
జర్నలిస్టుల సంక్షేమం రక్షణ, హక్కుల పోరాటానికి వారధిగా నిలుస్తూ , ప్రజల పక్షాన నిలబడుతున్న అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ దేశం నలుమూలలా తన సేవలను విస్తరిస్తోంది. ప్రశ్నించే గొంతులకే పట్టం కడుతూ ముందుకు సాగుతోంది.
పార్టీల జెండాలతో సంభంధం లేకుండా ABJF లక్ష్యాల సాధనే ప్రధాన అజెండాగా తన పరిధిని విస్తరించే క్రమంలో ,, సిద్ధిపేట జిల్లా కమిటీ ఏర్పాటుతో పాటు డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ను గౌరవ అడిషనల్ కలెక్టర్ చేతులమీదుగా నిర్వహించి ఆదిలోనే తన పంధా ఏంటో చాటి చెప్పింది ..
ఈ కార్యక్రమంలో ABJF జిల్లా అధ్యక్షుడు విజయ్ గణేష్ ,రాష్ట్ర ఈసీ మెంబెర్ మనోహర్ , వైస్ ప్రెసిడెంట్ జనగామ సతీష్ , ట్రెజరర్ వేముల కుమార్, పోతరాజు రమేష్ , మహేందర్ ,జీవన్ పాల్గొన్నారు.

