
పేరు : కాల్వ నిఖిత
ఊరు : సిద్దిపేట
ప్రభుత్వ డిగ్రీ
పీజీ కళాశాల సిద్దిపేట,
ఎం,ఎ తెలుగు
ప్రథమ సంవత్సరం,
చరవాణి: 6309 767 894
హామీ : ఇది నా సొంత కవిత
కలం కాగితంను తాకగానే
తల్లి బిడ్డను ముద్దడినట్టయ్యే…
ముత్యాల్లాంటి అక్షరాలను
దిద్దిన ఓ ! బంగారు కలమా…
నీ కలం విస్తృతితో
అక్షరాలు విశ్వవ్యాప్తమవ్వగా…
తన భావాలకు అలోచలను
పురుడు పోసుకోని కలం
నిప్పులు చిమ్ముకోగా….
బరువెక్కిన గుండెతో భావం
వ్యక్తపరిచే ప్రతి అక్షరం
మెదడును ప్రభావితం చేసే…
నుడికారపు పదాలతో
అల్లికమాలికలేస్తూ
కలం చిందులేయగా…
రచయితకు దిశనిర్దేశనం
చేస్తూ,సొంత శైలి వర్ణనతో
లోకాన్నలరించగా …
సాహితీ ప్రియులకి కలం
ఒక అస్త్రమవ్వగా…
సనాతన కాలం నుండి
సాంకేతిక కాలం వరకి
విప్లవాత్మక మార్పులు
సృష్టించిన కలమా…
కంప్యూటర్ కాలమచ్చినా
కలంకి విలువ తగ్గేనా…?
స్వేచ్ఛను హరిస్తున్న
సమాజంలో స్వేచ్ఛ
తెచ్చిన కలమా…
చెరుపలేని ఎన్నో
జ్ఞాపకాలకి సుస్థిరస్థానం
ఇస్తున్న కలమా…
మనిషిని నమ్మితే
మోసపోవచ్చేమో కాని
కాలాన్ని నమ్మితే కాదు…
రోజు నిన్ను ముట్టనిదే
సమయం గడువదాయే…
ప్రపంచాన్ని ఏలేటి కలమా
మరో ప్రపంచాన్ని రాయగా…
నీ సిరతో ఎన్నో ఉజ్వల
భవిష్యత్తులను తీర్చి దిద్దుతూ…
అక్షరాలకి పట్టం కట్టి
నవ్వులు విరబూయించిన
ఓ ! వజ్రాయుధమా
నా కలమా…..

