చమక్కుమనే చంద్లాపూర్ అని కల్పిత కథనాలను ప్రచురించడం కాదు , ఇక్కడి పారిశుద్ధ్యం పై ఒకసారి దృష్టిసారించండి అంటున్నాడు 10వ వార్డు కు చెందిన వార్డు మెంబెర్.
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను బానిసలుగా సొంత పనులకు నాయకులు వాడుకుంటుంటే పారిశుద్ధ్యం పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాడు..?
గ్రామనికి చెందిన ప్రయాణ ప్రాగణం కాస్తా డంప్ యార్డ్ లాగా తయారయ్యిందని, తానే నిరసనగా చీపురు చేతపట్టి శుభ్రం చేయడం మొదలుపెట్టారు…
గ్రామంలో నిర్లక్ష్యానికి బస్టాండ్ అద్దం పడుతోందని వాపోయాడు. గ్రామ ఖ్యాతిని రంగనాయక సాగర్ లో కలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.


