తెలంగాణా కాంగ్రెస్ లో మనిక్కం ఠాగూర్ చేయలేకపోయిన పని మనిక్ రావ్ థాక్రే చేసి చూపిస్తున్నారా..? రేవంత్ కి థాక్రే కి కెమిస్ట్రీ బాగానే కుదిరిందా..?

అంటే అవుననే చెప్పొచ్చు ..
పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండీ రేవంత్ రెడ్డి కి సీనియర్లు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారనేది జగమెరిగిన సత్యం, బహిరంగంగా నే ఆరోపణలు ,ప్రత్యారోపణలు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వారందరినీ బుజ్జగించడానికే సమయం సరిపోయేది ఇన్నాళ్లు.,,
కానీ ఏనాడైతే థాక్రే తెలంగాణా కాంగ్రెస్ ను గాడిలో పెట్టే భాద్యతలు చేపట్టారో ఆనాటి నుండి పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికీ కొందరు సీనియర్లు సహకరించకపోయినా, హాథ్ సే హాథ్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుండటమే దీనికి నిదర్శనం.

గతవైభవం తిరిగి వచ్చేలా ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండుతోంది., థాక్రే ప్రణాళికలు, రేవంత్ ఆచరణ విజయవంతం అయితే గనుక మునుపటి కాంగ్రెస్ ను మళ్ళీ చూస్తాం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.


