సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుక్కల నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. గతంలో ఏకంగా అదనపు కలెక్టర్ గారిని కుక్కలు గాయపరిచిన సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం మొదటి అంతస్థులో వీధి కుక్క
తాజాగా అదే సిద్దిపేట కలెక్టరేట్ లోని మొదటి అంతస్థులోకి వీధి కుక్క దూసుకురావడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. డస్ట్ బిన్ లను కింద పడేస్తూ అంతస్తు మొత్తం కలియతిరుగుతూ స్వైరవిహారం చేసింది..
ఈ మధ్యకాలంలో కుక్కల దాడులు అధికం అవుతున్నందున, మరో ఘటన జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేసారు
మారని తీరు కుక్కల జోరు
కలెక్టర్ కార్యాలయంలో కుక్కల స్వైరవిహారం