అకాల వర్షాలకు ఆగమైన రైతులకు చక్రధర్ గౌడ్ అండ
నంగునూర్ మండల గ్రామాలలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ బృందం పర్యటించింది. అకాల వర్షాలు కురిసి పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి, ధాన్యం నిలువ చేసే ఐకేపీ సెంటర్ల వద్ద టర్పలిన్ కవర్లు (పరదాలు) లేని వారికి కవర్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి కస్తూరి హరీశ్ మాట్లాడుతూ, మండలంలో కవర్లు లేక ధాన్యానికి రక్షణ లేక ఇబ్బంది పడుతున్న వారికి ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు టర్పలిన్ కవర్లు పంపిణి చెయ్యడం జరిగింది అని తెలిపారు.

రైతులకు అండగా మా ఫౌండేషన్ ఎల్లపుడు అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గణగోని రమేశ్, గ్యాదరి శివకుమార్, వంకాయల ఆనంద్, మంగలారం సాయి కృష్ణ, మల్యాల గణేష్, మంతపురి సాయిరాం,కొలిప్యక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

