ఈరోజు భారతీయ జనతా పార్టీ చిన్నకోడూరు మండల శాఖ

వడగళ్లతో దెబ్బతిన్న రైతులకు తక్షణమే సాయం అందించాలంటూ చిన్నకోడూరు బీజేపీ నాయకుల డిమాండ్

ఈరోజు భారతీయ జనతా పార్టీ చిన్నకోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను మరియు మామిడి తోటలను సందర్శించారు . ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పిట్ల పరశురాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రైతుల పరిస్థితి దీనావస్థలో ఉన్నా , ముఖ్యంగా ఆర్థిక మంత్రి ఇలా కలలో రైతుల పరిస్థితి చూస్తా ఉంటే రైతుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని పార్టీగా కనబడుతున్నదని అన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచడమనేది దౌర్భాగ్యమైన రాజకీయాలు ఫసల్ బీమా కింద రైతులను ప్రోత్సహించినట్లయితే నరేంద్ర మోడీ సర్కారుకు ఎక్కడ మంచి పేరు వస్తుంది అని దిక్కుమాలిన రాజకీయాలు చేసుకుంటూ పంట నష్ట పరిహారము రాకుండా చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు.

ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా బీజేపీ ఐటీ& సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజు ముచ్చర్ల మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఫసల్ బీమా కింద ప్రీమియం చెల్లించినట్లయితే ప్రతి ఎకరాకు 70 వేల రూపాయలు నష్టపరిహారం రైతుకు అందుతుండే ఇవాళ ఆ కార్యక్రమాన్ని రైతులతో చేపించకుండా ఎంతసేపు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంబరాలు చేసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు రైతులు అకాల వర్షాలతో కన్నీరు మున్నీరవుతా ఉంటే వాళ్ల కన్నీరును తుడవాల్సింది పోయి సంబరాలు చేసుకోవడం అనేది సిగ్గుమాలిన చర్య అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రవెల్లి రాజిరెడ్డి గారు శివరాం గౌడ్ గారు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ముచ్చర్ల నాగరాజు గారు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విష్ణుమూర్తి గారు యువమోర్చా ఉపాధ్యక్షులు రవి గారు నాయకులు నాగరాజు గారు తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *