జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ స్థలం మార్చాలి – ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్

ఇటీవల మద్యం దుకాణాల టెండర్లలో వచ్చినటువంటి శ్రీ మల్లికార్జున లిక్కర్ మార్ట్ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఉందని విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట మద్యం షాప్ ఉండడం కారణంగా విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారు, వచ్చి వెళ్లే దారిలో ఖాళీ సీసాలు డిస్పోజల్ గ్లాసులు, తాగిన మత్తులో చేసే ఇబ్బందికరమైన పనుల కారణంగా విద్యార్థి విద్యార్తినిలు కు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఈ యొక్క శ్రీ మల్లికార్జున లిక్కర్ మార్ట్ స్థలాన్ని మార్చాలని విద్యార్థుల యొక్క చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విన్నపిస్తుంది ఏబీవీపీ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్, పర్శరాం, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

