ఏబివిపి రాష్ట్ర నాయకులుగా సిద్దిపేట వాసులు
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయిన అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలను దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ లో సిద్దిపేట జిల్లా వాసులకు సముచిత స్థానం దక్కింది.
స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా వివేక్ వర్ధన్ ఎన్నిక

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గా పవన్ ఎన్నిక

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన సిద్దిపేట జిల్లాలో అనేక విద్యారంగ సంస్థల మీద అలుపెరగని పోరాటం చేస్తామని అలాగే విద్యార్థుల కి ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి సమస్య సాధనకై శ్రమిస్తామని వారు తెలియజేశారు. అలాగే ఈ బాధ్యతలను అప్పజెప్పినందుకు రాష్ట్ర శాఖకు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ విద్య అభ్యసిస్తున్న రోజుల నుండి విద్యార్థి పరిషత్ సామాన్య కార్యకర్తగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ మా ఉద్యమాలను అణిచివేసే విధంగా ప్రశ్నించే గొంతుకలుగా మా విధానాలను వినిపిస్తే అణిచివేయడానికి అనేక అక్రమ కేసులు పెట్టిన భయభ్రాంతులకు గురిచేసిన ఏనాడు కూడా వెనకకు తగ్గకుండా పనిచేశాము అలాగే రాష్ట్ర శాఖ మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఇకముందు కూడా అనేక ఉద్యమాలు చేసి ఈ జాతీయ పునర్నిర్మానం కోసం పనిచేస్తున్న ఏబీవీపీలో మా వంతు పాత్ర పోషిస్తామని వారు తెలియజేశారు

