ప్రశ్న కు అంత పరేషాన్ అవ్వడం ఏంది ..? అంత భయం ఎందుకు మీ మీ చేష్టలతో సామాన్యుడని అసమాన్యుడిగా మీరే తయారు చేస్తున్నారు అంటున్నాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి ఉప సర్పంచ్.
గ్రామంలో అవినీతి అక్రమాలపై, గళం ఎత్తడమే నేరమా అని ప్రశ్నించారు.గ్రామంలో నాయకుల డొల్లతనం ఎక్కడ బయటపెడతానో అని భయపడి , మంత్రి గారి కార్యక్రమం సందర్భంగా నన్ను ముందస్తుగా అరెస్ట్ చేసారని తెలిపాడు.

ఒక గ్రామ పౌరుడిగా, ఉప సర్పంచ్ గా వేదిక పంచుకుని సమస్యలు విన్నవించి పరిష్కారం దిశగా కృషి చేయాలని భావించిన నన్ను భాదించడం BRS నాయకుల చేతగాని తనం అని మండిపడ్డారు. కార్యక్రమంలో రాకుండా అడ్డుకున్నా నన్ను ఆపలేరని, సమస్యలు అన్నింటిపై శ్వేత పత్రం ప్రజాక్షేత్రంలో విడుదల చేస్తామని హెచ్చరించారు.

