బంజేరుపల్లి మా కన్నతల్లి
RAMESH POTHARAJU:
ఆ రోజుల్లో పెద్దలను స్మరిస్తూ ,తమ కష్ట సుఖాలను అభివర్ణిస్తూ , సాంస్కృతిక చరిత్రను వివరిస్తూ సాగే పాటలతో ఎంతో సంబరంగా జరిగేవి బతుకమ్మ వేడుకలు ,
కానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది, పండుగ విశిష్టతలను తెలుసుకోవడం పక్కన పెట్టి అసలు పండగ ఎలా జరుపుకోవాలో కూడా అవగాహన లేకుండా ఉంది నేటి తరం.
ఆ పాటలే ఆటవిడుపు , ఆ పాటలే మేలుకొలుపు, ఆ పాటలే పల్లెల్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలకు ఊపిరిలూదాయి .
కానీ పాశ్చాత్య దుస్తుల్లో , పాడులదిబ్బ పాటల్లో , DJ సప్పుళ్ళతో ఊగిపోతున్నాయి నేటి పల్లెలు.
ఇంతటి విచ్చలవిడి సంస్కృతిలోనూ అక్కడక్కడా కొన్ని పల్లెలు సంస్కృతికి అద్దం పడుతూ, పాశ్చాత్య ధోరణికి అడ్డు పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మల్లన్న సాగర్ ముంపు గ్రామం అయిన బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామం నిరాడంబరంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించి మనసులు దోచుకుంది.
ప్రభుత్వం నిలువ నీడ లేకుండా చేసి పల్లెను మా నుండి దూరం చేసిందే గాని పల్లె సంస్కృతిని కాదని , పల్లె పట్నం చేరినా అవ్వల ఆట తీరులో మార్పు లేదని, సంస్కృతి చెక్కు చెదరలేదని చెప్తూ , కన్నతల్లి లాంటి ఊరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు గ్రామస్థులు .



