సామాన్యుడే బలిపశువు
కొన్ని ప్రాజెక్టులు ఏళ్ళు గడిచినా ముందుకు సాగవెందుకో
భయ్యా బయ్యారం లేదు భాద్యత లేదు ఎవరికీ
అంటే ఏదో ఎవరికో దోచిపెట్టడం మాత్రమే కాదు, అసలు విషయాన్ని దాచి పెట్టడం కూడా ..

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటారు రాజకీయ పార్టీలవారు .
ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో పెట్టే ప్రతీ ప్రాజెక్టు వెనకాల ఎన్నో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉంటాయి. బాగా ప్రాచుర్యం పొందిన పనులను పట్టుకుని పోరాటం చేసినట్లు నటిస్తేనే కదా వాళ్లకైనా ప్రాచుర్యం దక్కేది.
ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కాలం గడపడం అంతే ..బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు Feasibility ఉందొ లేదో అప్పుడే చెప్పినా ఇంత గందరగోళం ఉండేది కాదు , పోనీ రాష్ట్రప్రభుత్వం అయినా ఒకే అంశాన్ని పట్టుకుని గట్టిగా పోరాడింది లేదు.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాలం గడుస్తోంది ,
- మేధావులు విశ్లేషకులకు పని దొరుకుతోంది ,
- మీడియాకు వార్తలు దొరుకుతున్నాయి .
ఎటు చూసుకున్నా అయోమయంలో కొట్టు మిట్టాడి, ఉపాధి లభిస్తుందనే ఆశలో ఆశాభంగానికి గురయ్యేది సామాన్యుడే.

