కన్వీనర్ల నియామకం
సిద్దిపేట జిల్లా బీజేపీ ఐటీ& సోషల్ మీడియా కన్వీనర్ గా నాగరాజు ముచ్చర్ల ను నియమిస్తూ బీజేపీ ఐటీ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ A.వెంకటరమణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు .

విద్యార్థి దశ నుండి గతంలో వివిధ అనుబంధ సంస్థలలో పనిచేసిన ముచ్చర్ల నాగరాజు
2013-14 లో డిగ్రీ కళాశాల ABVP ప్రెసిడెంట్ గా 2014-16వరకు సిద్దిపేట ABVP టౌన్ కార్యదర్శి గా పనిచేశారు.
అనంతరం 2017 నుంచి బీజేపీ లో సభ్యత్వంపొంది, పార్టీ కి చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 లో సిద్దిపేట బీజేపీ ఐటీ&సోషల్ మీడియా విభాగం జిల్లా కన్వీనర్ గా 2022 లో సంగారెడ్డి సోషల్ మీడియా జిల్లా ఇంఛార్జి గా నియమింపబడ్డారు.

తాజాగా సిద్దిపేట జిల్లా బీజేపీ ఐటీ& సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గా నియమింపబడటం తన భాద్యతను మరింత పెంచింది అన్నారు నాగరాజు ముచ్చర్ల.
దీనికి కారణం అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి , బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ గారికి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలిపారు .

