బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

ఆత్మీయ సమ్మేళనం కాదు ఇది రాజకీయ సమ్మేళనం -మీసం నాగరాజు యాదవ్

బిఆర్ఎస్ పార్టీది ఆత్మీయ సమ్మేళనం కాదని రాజకీయాల సమ్మేళనం అని, కేవలం వచ్చే ఎన్నికలకు ప్రచారంలో భాగంగానే, ఈ ఆత్మీయ సమ్మేళనాలని..కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యర్యదర్శి మీసం నాగరాజు యాదవ్ అన్నారు

కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ ఆత్మీయ సమ్మేళనాలు అని అన్నారు. రాష్టంలో ఎక్కడ లేని అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని చెప్పే హరీష్ రావ్, ఎన్నికల కోసం ఇప్పటి నుండి ఇంత హడావిడి, కోట్లరూపాయల ఖర్చులు చేసి జనాన్ని పోగేసి మీటింగ్ లు ఎందుకని ప్రశ్నించారు .

చిన్నకోడూరు మండలంలో రెండు నీటి ప్రాజెక్టులు ఉన్నా, పూర్తి స్థాయిలో పనులు కాకుండానే ఆగమేఘాల మీద ప్రారంభించి కనీసం 5సంవత్సరాలు అయినా, ఇప్పటివరకు చెరువులకు, కుంటలకు నీళ్లు వచ్చే విధంగా కాలువలు తవ్వకపోడం తో నీవు చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందన్నారు. నీరులేక పంటలు ఎండి ప్రజలు అల్లాడుతుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరిట రాజకీయం చేస్తున్నారని ఎద్దేవాచేశారు

మంత్రి హరీష్ రావ్ సిద్దిపేటకు చేసింది ఏమిలేదన్నారు .ఏదైతే అభివృద్ధి జరిగిందో అది మెకానిజంలో భాగంగా జరిగిందన్నారు. కేవలం కమీషన్లు వచ్చే పనులే చేస్తారు తప్ప, ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు .కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అబివ్రుద్దన్నారు .రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ మాజీ అద్యక్షులు సందబోయిన పర్శరాం ,ప్రశాంత్ ,రాజనర్సింలు తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *