
ఈ బొమ్మ గీస్తున్నంత సేపు సదరు కార్టూనిస్ట్ ఒళ్ళు ఎంత పులకరించిపోయిందో కదా ! ప్యాంటు తొడిగి చెప్పులు గీస్తుంటే పాదసేవ చేసినంత భాగ్యం కలిగిందో ఏమో..
రెండు అడుగులూ గీస్తున్నంత సేపు 500 ల (గజాలు) క్షమించాలి, అడుగులూ మదిలోకి వస్తూ మరింత ఉత్సాహ పరిచి ఉంటాయ్. ఇక్కడ ఆయనగారు ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ బొమ్మ గీసారో అందరికీ తెలిసిందే. ఆ విషయం కాస్త పక్కన పెడదాం..
అయ్యా చిన్నదొరా ఈ ప్రజాస్వామ్యం లో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు అవకాశం లేదంటారా ? ఓహో రాజ్యాధికారమే మా దొరల చేతిలో ఉంది ఇంకా రాజ్యాంగం తో నాకేం పని అంటావా ?
NOTE: మీరు దొరలైనా నాలాంటి సామాన్యుడవనే ఒక మాట చెప్పాలనిపిస్తోంది., మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం మీ వ్యక్తిత్వాన్ని చంపుకుని పని చేయకండి., కుదిరితే మీరు కూడా పోటీ చేయండి అంతే గాని సామాన్యులను బానిసలుగా భావించకండి.
ఇక్కడ మీరు అవమానించింది ఒక్క మిమ్మల్ని భయపెడుతున్న సమాజ సేవకుడిని మాత్రమే కాదు,
యావత్ తెలంగాణా సమాజాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని అంతమొందించేందుకు ఉవ్విళ్లూరుతున్న ఉడుకు రక్తాన్ని.

