మారని తీరు పట్టించుకునేవారెవరు ?
హోలీ పండుగలో ఉన్నన్ని రంగులు ఉంటాయి మన చంద్లాపూర్ నాయకుల దగ్గర , అవినీతి ,అధికార దుర్వినియోగం ,గ్రామ పంచాయితీ నిధుల దుర్వినియోగం , ఇలా ఎన్ని విషయాల పై వార్తా కథనాలు వచ్చినా కుక్క తోక వంకర అన్నట్టు బుద్దిమాత్రం మార్చుకోరు. ఒక విషయం పై ప్రశ్నిస్తే ఇంకో విషయం లో తప్పు చేస్తారు తప్పితే తీరు మార్చుకోరు .
గ్రామ పంచాయితీ లో సీసీ కెమెరా రిపేర్ చేసిన వ్యక్తి కి బిల్ ఇవ్వకుండా అడ్డదారిలో నొక్కొసారని కథనం వచ్చి పది రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు .

తాజాగా గ్రామ పంచాయితీ వాటర్ ట్యాంకర్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్ సీసీ రోడ్డు పనికి వాడుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. గ్రామస్థులకు ఏదైనా అవసరం అయితే నానా కారణాలు చెప్పే నాయకులు , గ్రామ పంచాయితీ అధికారులు కాంట్రాక్టర్లకు మాత్రం కొమ్ము కాస్తున్నారు .


