నిధుల దుర్వినియోగంలో ఆదర్శంగా చిన్నకోడూర్

నిర్లక్ష్యమే కాదు నిరుపయోగ కట్టడాలకు అడ్డాగా మారుతోంది చిన్నకోడూర్. Feasibility ఉందా లేదా అనే అంశాలను లెక్కలోకి తీసుకోకుండా, కేవలం కాంట్రాక్టులు దక్కించుకోవడంకోసం , స్థానిక నాయకులు లేనిపోని ఆడంబరాలకు పోయి ప్రజాధనాన్ని వృథా ఖర్చు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ దాదాపుగా 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 30లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ మార్కెట్ ను 2018 సంవత్సరంలో ప్రారంభించగా కొన్నిరోజులు మాత్రమే నిర్వహించినట్లు సమాచారం.

నిర్వహణా భాద్యతలు తీసుకోవాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చిన్నకోడూర్ శాఖ వారు అటుగా కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు తెలిపారు.

మార్కెట్ దుస్థితి


ఇకనైనా ఈ మార్కేట్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని, లేదా ఏదోవిధంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలని లేని యెడల నివాసాల మధ్యలో ఉన్న ఈ కట్టడం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశం ఉందని అంటున్నారు, ఏళ్ళుగా నిరుపయోగంగా ఉడటం వల్ల పాములు, కీటకాల బెడద ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *