చిత్ర కవిత

అంశం: చిత్ర కవిత

శీర్షిక : భూమికి పచ్చాని రంగేసినట్టు

కనుల కాంతికి సాలని ఆ సాగు’బడి’లో గదులనే మడులెన్నో……

వంగిన పైరనే ఊయలలో ఊగి ఆడిన దువ్వెనల ( బూగల) దండు…..

పైరు పచ్చపాన్పై ఆహ్వానిస్తుంటే ఆగేదెట్ల పానం….
అక్కడక్కడ కనిపించే ఆ చెట్లు ఆత్మీయంగా పలకరిస్తుంటే….

ఆ కమనీయ దృశ్యాన్ని నా కనుల కారాగారంలో బంధించబోగా…! కనిన ఆ కంచె కాపాడవచ్చెనా అన్నట్టు అనిపిస్తున్నది……..

అదొక ద్వీపమై….
సుట్టు సుందరమైన ఆ పొలాల నడుమ, నందనమైన నివాసం కొరకు కర్రలతో చేసిన ఆ గృహాలు , పైకి ఎక్కేందుకు నిచ్చెన మెట్లు స్వర్గానికి దారి చూపేలా ఉన్నాయి……

చిన్నా పెద్దా అంటూ తగువు పడుతున్నాయా అన్నట్టు,
ఆ తాటి తరువుల జంట….

ప్రకృతి ఒడిలో ఉండి పీల్చే ప్రతి శ్వాస స్వచ్ఛమైన గాలినిస్తుంటే…..
ఇంకేం కావాలి ఈ బతుక్కీ…

పేరు: ముక్కపల్లి సాగర్

ఊరు : పద్మనాభుని పల్లి ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల సిద్దిపేట

చరవాణి :9866209436 హామీ: ఇది నా సొంత కవిత

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *