టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన అజ్జు యాదవ్

యుధిష్ఠిర వార్త చిన్నకోడూరు
నామినేటెడ్ పోస్టుల్లో అవకాశమివ్వాలని కోరిన అజ్జు యాదవ్: [యుధిష్ఠిర వార్త] చిన్నకోడూరు:
ఈ రోజు గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు అజ్జు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలిపినట్లు సిద్ధిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు.

పార్టీ కష్ట కాలంలో కార్యకర్తలతో కలిసి సమన్వయం చేసుకుంటూ అధికారంలోకి రావడం కోసం నిరంతరం కృషి చేస్తూ,కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి శాయ శక్తుల కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని కోరారు. దీనికి మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్, మండల నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చింతల్ రాజు యాదవ్, చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బైరోజ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

