ప్రాజెక్ట్ ల పేరు తో రైతులను మోసం చేసిన హరీష్ రావ్

ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు లు నిర్మించి కాలువలు తవ్వడం మరిచిన హరీష్ రావ్

మండల కేంద్రమైన చిన్నకోడూరు లో ఏర్పాటు చేసిన సమావేశం లో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గం లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము తో పోలీస్ పహార ల మధ్య రైతుల భూములు గుంజుకొని ప్రాజెక్టులు నిర్మించి చెరువులకు కాలువలు తవ్వకుండా హరీష్ రావ్ నియోజకవర్గం ప్రజలను మోసం చేసాడని మండిపడ్డారు. అంతే కాకుండా కాళేశ్వరం తొలి ఫలితం సిద్దిపేట కే దక్కిందని ప్రచారం చేసుకునే హరీష్ రావ్ చిన్నకోడూరు మండలం లో ఉన్నటువంటి చెరువులు చిన్నకోడూరు బెల్లం కుంట  మాచపూర్ ముద్దం కుంట, అల్లీపూర్, కర్ణాలకుంట,కమ్మర్లపల్లి, కొండేంగలకుంట, బిక్కబండ,జాల్ చెరువు,కొత్త పల్లి, కాసారం పల్లి కొత్త కుంట, కొచ్చేరువు లకు అనుసంధానముగా వున్నా , చెరువు లకు కాలువలు తవ్వకుండా రైతుల ను మరొకసారి మోసం చేసారని మండిపడ్డారు.

గడిచిన 10 ఏండ్ల లో  హరీష్ రావ్ కేవలం ప్రచార అర్బటాలకే పరిమితమయ్యారు తప్ప నియోజకవర్గ ప్రజలకు ఒరేగబెట్టింది ఏమి లేదన్నారు.అంతే కాకుండా నూతనంగా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటాక ముందే నియోజకవర్గం లోని ప్రజలు చెరువులకు కాలువలు లేకపోవడం తో రోడ్లపై,ప్రాజెక్టు వద్దా ధర్నాలు చేస్తున్నారంటే గతం లో హరీష్ రావ్   అభివృద్ధి తేటతెల్లమైంది అన్నారు.మరియు గతం లో నియోజకవర్గం లో వున్నా ప్రాజెక్టు ల నుండి చెరువులకు  కాలువలు తవ్వకుండా ఇప్పుడు అధికారం కోల్పోయాక ,రైతు లపై మొసలి కన్నీరు కారువడం హరీష్ రావ్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు

ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాములు, బీసీ సెల్ సిద్దిపేట అసెంబ్లీ కన్వీనర్ బత్తుల మల్లేశం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, nsui మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉడుత ప్రశాంత్, సీనియర్ నాయకులు కోరిమి రాజు, ఇర్మల్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *