పండగ అంటేనే పదిమందిని ఏకం చేసేది , వినాయక ఉత్సవాలు గాని , అమ్మవారి నవరాత్రులు గాని నిర్వహించడం వెనక ఇదొక కారణం , కానీ దేవుడి పేరుతో సంఘటితం అయ్యి ధర్మ పరిరక్షణకు పాటు పడాల్సింది పోయి పోటీ పడుతున్నాయి కొన్ని పల్లెలు… గల్లీ గల్లీకి ఒక విగ్రహం , ఒక్కో కుల సంఘానికి ఒక మండపం , ఎలా పోటీ పడుతూ అసలు సంగతి మర్చిపోతున్నారు

ఇంతటి పోటీ వాతావరణం లోనూ నిబద్దతతో, నియమ నిష్టలతో ఊరంతా ఏకమై అమ్మవారికి పూజలు నిర్వహించి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామం .
9 రోజులు ఘనంగా పూజలు జరిపించి , ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించి నేడు నిమజ్జనం చేశారు
Super
🙏🚩