ముఖ్యమంత్రి ఇలాఖాలో డబుల్ లొల్లి

డబల్ బెడ్ రూమ్ ఏమో కానీ కష్టాలు డబుల్ అయ్యాయి పేదోడికి . గట్టిగా వాన వస్తే కూలిపోయే ఇళ్లకు ఇంద్రభవనాలు అన్నంతగా ఆర్భాటం చేసి ప్రజలను ఆగం చేస్తున్నారు ప్రచారం కోసం అక్కడక్కడా కొన్ని మాత్రమే కట్టించి పేదరికం లో ఉన్నవాళ్లకు కొత్త పంచాయితీ పెట్టించారు.

కౌన్సిలర్లు , సర్పంచ్ లు , అధికారులకు లంచాల పేరుతో కొత్త ఉపాధి కల్పించారు . వేలం పాట వేసినట్టు లబ్ధిదారులు మారుతూనే ఉంటారు . లిస్ట్ లు వస్తూనే ఉంటాయి నాయకులకు అనుకూలంగా లేకపోతె ప్రజలకు ఏది అనుకూలించదు .

స్వయానా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లో ఒక పేదోడి ఆత్మహత్య ఘటన మరవక ముందే , మరో అభాగ్యురాలు మంజుల ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది .

విషయం తెలుసుకున్న బీజేపీ గజ్వెల్ నియోజకవర్గ కో-కన్వీనర్ బండారు మహేష్ ఆసుపత్రికి వెళ్లి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పారు . వారితో పాటు గజ్వెల్ పట్టాన ప్రధాన కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు మైస విజయ్ ఉన్నారు .

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *