ఎన్నికల యుద్ధం

ఎన్ని”కల” యుద్ధం

ఎన్నికల యుద్ధం ఎన్ని కలల యుద్ధమో కదా !
అక్రమార్జన చేయొచ్చనే కలతో ఒకరు ,
అదే అక్రమార్జన కాపాడుకునేందుకు ఒకరు,
రాజ్యాధికారమనే కిక్కు కోసం ఒకరు ,
కులం పేరిట ఒకడు,మతం మాటున ఒకడు,
ప్రాంతీయ వాదం తో ఒకడు, తీవ్రవాద ఆలోచనలు నిండిన మరొకడు ,

చుక్కల్లా లెక్కపెట్టలేనంత సంపద కోసం ఒకడు ,
చుక్క మందు చాలనుకునే వాడొకడు ,
ఇలా ఎంతమంది యొక్క ఎన్ని”కలల” యుద్ధమో కదా .

పూర్వం రాజుల యుద్దాలు చూడలేని మనకు అంతకు మించిన ఎత్తులకు పై ఎత్తులతో , కార్యకర్తల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ , ఎన్నికల యుద్దాలను పరిచయం చేస్తున్నారు నేటి తరం నాయకులు .
ఖమ్మం లో కబాడి మొదలెట్టింది ఒకపార్టీ .పట్నం లో పాచికలు ఆడనుంది మరో పార్టీ , ఆటగాళ్లు ఎవరైనా ఆటలో అదేనండి తొక్కిసలాట లో అరటిపండు మాత్రం సామాన్యుడే

జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలెట్టడానికి ఖమ్మమే ప్రధాన గుమ్మం అని భావించింది భా.రా.సా ,రాష్ట్రానికి ఆయువుపట్టు హైదరాబాద్ నుండే ఆట మొదలెట్టింది భాజాపా .

ఈ యేడు ఒకరి కల మరు యేడు మరొకరి కల నెరవేరడం ఖాయం , ఎప్పటికీ నెరవేరందల్లా ఒక్క సామాన్యుడి కలలు మాత్రమే….

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *