గల గల్లా పారేటి గంగమ్మ తల్లిని నల్లరేగళ్లకే మళ్లించినాడమ్మ…..అని మన పెద్ద రైతన్న అంటూ ఒక వ్యక్తిని కీర్తించారు కదా…
అలాంటి కీర్తి మాకు కూడా దక్కాలి అనుకున్నారో ఏమో , మినీ తెలంగాణా అయిన చంద్లాపూర్ లో బడా, మినీ నాయకులు అంతా కలిసి ప్రజల ఇళ్ళల్లోకే నీరు ప్రవహించేలా చేస్తున్నారు.
వానాకాలం ముందు మోరీలు సాఫ్ చెయ్యకుండా ఇలా మురికినీరు ,వాన నీరు కలిసి ప్రజల ముంగిట్లో పారేలా చేస్తున్నారు…..
పల్లె ప్రగతి లో నాయకుల ఇళ్లల్లో ధన ప్రవాహం ప్రజల ఇళ్ళల్లోకేమో నీటి ప్రవాహం అన్నట్లు.
చల్లారపు రాజిరెడ్డి అగచాట్లు అన్నీ ఇన్నీ కావనుకోండి.
ఇష్టం గా కట్టుకున్న ఇళ్ళు ముందు ఇన్ని కష్టాలు అంటే కష్టమే కదా మరి…
చమక్కుమనే ముందు గుండె చివుక్కుమనక మానదు…
ఇక్కడ నాయకులకు పారిశుద్ధ్యం అనే పదం అశుద్ధం, అనవసరం..


