GATE ALL INDIA 53RD RANK
ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యత పరీక్ష GATE లో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు గుడాల అజయ్ అల్ ఇండియా 53వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన అజయ్ ను తండ్రి గుడాల తిరుపతి ఎంతో కష్టపడి చదివించాడు. తండ్రికి చేదోడుగా ఉంటూనే అజయ్ చదువు కొనసాగించాడు. డిప్లొమా విద్యను భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో చదివిన అజయ్ , B.tech విద్యను మల్లారెడ్డి కళాశాలలో పూర్తి చేసాడు.
తదనంతరం తన తల్లిదండ్రుల కలను ,తన కలలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ., నిరంతరం శ్రమించి GATE పరీక్షలో జాతీయ స్థాయిలో 53వ ర్యాంక్ సాధించాడు.
తమ కొడుకు ఈ ఘనత సాదించడంపట్ల తల్లి మణెమ్మ, తండ్రి తిరుపతి ఆనందం వ్యక్తం చేసారు.

తన లక్ష్యాలను చేరుకునే విషయంలో తోడ్పాటునందిస్తున్న తల్లిదండ్రులు, స్నేహితులు అందరికీ అజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.


