కాలం నిందల పాలయ్యింది

పేరు :ముక్కపల్లి సాగర్
ఊరు : పద్మనాభుని పల్లి, ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల సిద్దిపేట, ఎం ,ఎ తెలుగు ప్రథమ సంవత్సరం,
చరవాణి : 9866209436
హామీ : ఇది నా సొంత కవిత

తెలివిగల జాతిలో జన్మించి, జగత్తునంతా జల్లెడలా చిల్లులు పొడుస్తుంటే,
అవును నిజమే కాలం మారింది.......

జీవితాన్ని జీవించమంటే, నానా రకాలుగా నటిస్తూ, నాశనం వైపు నడుస్తుంటే,  అవును నిజమే కాలం మారింది........

దినదినము దిగజారుతూ, కాలాన్ని కంటు చేస్తూ, అజ్ఞాన అంధకారాన్ని చూస్తుంటే, అవును నిజమే కాలం మారింది........

సోకులని,సొమ్ములని సింగారించుకుంటూ, సాంప్రదాయాల్ని  సజీవ దహనం చేస్తుంటే, 
అవును నిజమే కాలం మారింది......

ఆచారాలన్నీ అంతరించేలా అత్యంత ఆసక్తిని  చూపుతూ అడుగులేస్తుంటే, అవును నిజమే కాలం మారింది.......

సేవ సెయ్య సేతులు రాని సమాజంలో,  సజీవులై సంచరిస్తూ సొల్లు సందేశాలిస్తుంటే,  అవును నిజమే కాలం మారింది........  

సదివిన సదువంతా  సంస్కారహీనమై సచ్చిపోతుంటే, అవును నిజమే కాలం మారింది........

పేగు బంధాలన్నింటిని పక్కనపెట్టి, పైసల ప్రలోభంలో పయనిస్తుంటే,అవును నిజమే కాలం మారింది.........

ప్రేమ అనే పేరు పెట్టి, వ్యామోహంలో విహరిస్తుంటే,  అవును నిజమే కాలం మారింది..........

ప్రపంచీకరణ పేరుతో ప్రకృతంతా పరమపదించేలా పాటుపడి, అది పాడె అయి   పడుంటే, అవును నిజమే కాలం మారింది............

 మారిపోయింది మనం -  నిందల పాలయ్యింది కాలం
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *