
శీర్షిక :కదులుతున్న కాలం
పేరు :చింతల శ్రీలత
ఊరు: మిట్టపల్లి
చరవాణి : 95154 75990
ప్రభుత్వ డిగ్రీ & పీజీ
కళాశాల సిద్దిపేట
హామీ : ఇది నా సొంత కవిత
మనుషులు ఆగుతున్న కాలము ఆగదు
కాలం మారుతున్న
మనుషుల జీవితం మారదు
సూర్యుడు ఉదయించడానికి ముందే పొద్దు తిరుగుడు పువ్వు ఎదురుచూస్తుంది,
కానీ మనుషులు ఎదురుచూడని కాలం ఇది,
ఆగిపొమ్మంటున్న ప్రాణం ఇది,
కదలి పొమ్మంటున్న కాలం అది
ఆ రెండిటి మధ్య గడియారం నలిగిపోతుంది,
కాలము పరిగెత్తుతుంటే మనుషులు మాత్రం పరుగెత్తరు
మనుషులు పరిగెత్తేదాక కాలమును తిడుతారు,
తాను కూర్చొని ఒకరిని నిల్చోమనే జీవితాలు ఇవి,
చెప్పకుండా వచ్చేదే సమయం – తెలిసి చేసేదే మనిషి
కాలము నాతో రమ్మంటుంది కానీ మనుషులు మాత్రం నెమ్మదిగా వెళ్లే కాలానికి అలవాటు పడ్డారు
కాలం ఆగదు – మనిషి మారాలి.

