MALLANNA KATHALU/మల్లన్న కథలు

RAMESH POTHARAJU:

ED ని బోడి అంటారొకరు ,సిట్ ని షిట్ అంటారు మరొకరు . అవినీతి అక్రమాలను అరికట్టడానికి ఏర్పాటు చేసుకున్న అన్ని దర్యాప్తు సంస్థలను ,ఆయా పార్టీల అనుబంధ సంస్థలు అని ఒకరినొకరు విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారు.

విమర్శలతో సరిపెట్టుకోకుండా పిచ్చి పారాకాష్టకు చేరుతోంది , ఎంతలా అంటే, తమ పార్టీ కేద్రంలో అధికారం లోకి వస్తే ఎవరికి వారు విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన దారిలో ఎంతైనా సంపాదించుకోవచ్చు , వాళ్లకు వాళ్ళే ఇష్టం వచ్చినంత ఇన్ కమ్ టాక్స్ కట్టుకోవచ్చు అనేంతలా.

MALLAREDDY MINISTER

సంచలన కామెంట్లకు ,కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మంత్రి మల్లారెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశం అవుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ క్రీడలో ప్రజలంతా ప్రేక్షక పాత్రకు పరిమితం అవ్వాల్సి వస్తోంది .

మల్లన్న లాంటి మంత్రులు వస్తుంటారు, పోతుంటారు.శాశ్వతమైన ,ప్రజా ప్రయోజనాలను కాపాడే దర్యాప్తు సంస్థలను బలోపేతం చెయ్యాల్సిన అవసరం , భాద్యత రెండూ ఉన్నాయి.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *