శానగొండ భాస్కరా చారీ 29 వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
శానగొండ భాస్కరా చారీ 29 వ వర్థంతి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామంలో చీలాపూర్ గ్రామ దివంగత సర్పంచ్ శానగొండ భాస్కరా చారీ గారి 29 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఆయన కుమారులు శ్రావణ్,శరత్ లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు స్వర్గీయ శానగొండ భాస్కర చారి గారి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ గ్రామములో విగ్రహం నెలకొల్పాలని సూచన చేస్తూ,ఆనాటి సేవలను నేటికి ప్రజలు స్మరిస్తున్నారంటే ఆ సేవ దృక్పధం ఎంతటి గొప్పదో అర్థమవుతుంది.చీలాపూర్ గ్రామము విద్యలో ఉద్యోగాలలో ఆదర్శంగా ఉందంటే ఆయనగారి పాత్ర కూడా లేకపోలేదు.దురదృష్టవశస్తు పసిప్రాయములో తండ్రిని కోల్పోయి తండ్రి ఆలనాపాలనా తెలియని తనయులు శనాగొండ శ్రావణ్,శరత్ లు కూడా తల్లిదండ్రులకు విలువ ఇవ్వని ఈ రోజుల్లో కూడా భౌతికంగా దూరమైన తన తండ్రి ఆశయసాధనకు కృషి చేయడం గర్వించదగ్గ విషయం.నేటి యువతకు ఆదర్శమే అంటూ తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయులకు ప్రశంషల జల్లు కురిపించారు.తదుపరి రక్తదాన,అన్నదాన శివిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సుజిత్ కుమార్,మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మైల ప్రభాకర్,కిసాన్ సెల్ అధ్యక్షుడు రొడ్డ మల్లేశం,బీసీ సెల్ అధ్యక్షుడు గుడెల్లి శ్రీకాంత్,మండల ఉపాధ్యక్షులు ముక్కేర కొమురయ్య,ఎస్సి సెల్ కొంకటి రాములు, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్,మానకొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాంకలి ప్రవీణ్, మచ్చ కుమార్, గ్రామ ప్రజలు పలువురు పాల్గోన్నారు.

