ఎస్సీ 57 MBSC(ఉప)కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటుచేసి నిధులు కేటాయించాలి .

Yudhisthira Vaarta: (Ramesh Potharaju ):
ఎస్సీ 57 MBSC(ఉప)కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటుచేసి నిధులు కేటాయించాలి .
కులదృవీకరణ పత్రాలను RDO పరిదినుండి తొలగించి తహశీల్దార్ ద్వారానే ఇవ్వాలి తప్పుడు దృవపత్రాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అర్హులకే అందించాలి .
57 MBSC కులాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇవ్వాలి .
చేవెళ్ళ దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 57 MBSC కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే నిధులు విడుదలచేయాలని
ఎస్సీ 57 ఎంబి ఎస్సీ కులాల హక్కుల పోరాటసమితి జాతీయ వ్యవస్థాపక అద్యక్షులు బైరి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

నేడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మానిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 MBSC(ఉప) కులాల కార్పొరేషన్ ఈనాటికీ కూడా ఏర్పాటుచేయకపోవడం అత్యంత హేయనీయ మని అన్నారు . మాల ,మాదిగ కులాలతో కలుపకుండా వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు .
కొంతమంది స్వార్థపూరితంగా ప్రచారం చేస్తున్నవిధంగా ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ -1,2,3 ల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే గ్రూప్ -1 లో ఉన్న15 కులాలకు 1 శాతం సరిపోకపోగా , గ్రూప్ -2లో ఉన్న 17 కులాలు , గ్రూప్ -3లో ఉన్న 25 కులాలు మాల, మాదిగ కులాలతో కలిసి ఉన్నఈ కులాలు వారితో పోటీపడలేక తీవ్రంగా నష్టపోయి అణిచివేతకు గురవుతాయి. గత పదిహేను సంవత్సరాలుగా 57 MBSC కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకోసం మా కులాలము పోరాడుతున్నాము . కావున చేవెళ్ల దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 57 MBSC కులాలకు ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
అనేక సంవత్సరాలుగా కనీసం కుల దృవీకరణ పత్రాలను సకాలంలో పొందలేక ఎంబి ఎస్సీ కులాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు . బీసీ లలో ఉన్న నూట ఆరవై కులాలకు,ఎస్సీ లలో మాల మాదిగ కులాలకు తహశీల్దార్ కులపత్రాలను ఇస్తూ దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 కులాలకు ఆర్డీవో పరిదిలో ఉంచడం వల్ల సకాలంలో పత్రాలు పొందక విద్యకు ,ప్రభుత్వ పథకాలకు మా కులాలు దూరమౌతున్నాయని . కావున ఆర్డీవో పరిదిలో ఉన్న నిబందనలే తహశీల్దార్ పరిదీలో ఉంచి మాల మాదిగలతో పాటు మొత్తం దళితులలో అర్హులకే కులదృవీకరణ పత్రాలను పదిరోజుల వ్యవదిలో జారీచేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు .

రాష్ట్రంలోని అన్నీ జిల్లాల నుండి రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కు వివిద పనులపై వచ్చే మా ఎస్సీ ఉపకులాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ,పోటీ పరీక్షల కోసం వచ్చే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరియు వివాహదీ శుభకార్యాలు ,సంఘ సమావేశాలు నిర్వహించుకునే విధంగా 57 ఉపకులాలన్నిటికి కలిపి ఒకే భవనము నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .