సయ్యద్ అయూబ్ ఇతనొక సంచార ముస్లిం.., ఫేస్ బుక్ లో తెలంగాణ సీఎంఓ ద్వారా నిర్వహించబడే అధికారిక పేజీ లో కామెంట్ రూపంలో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఇది అతనొక్కడి పరిస్థితి మాత్రమే కాదు , సంచార జీవనం గడిపే ప్రతి ఒక్కరి పరిస్థితి ., అతని మాటల్లోనే ..
సీఎం సార్ మేము సంచార ముస్లిం ఊరు ఊరు తిరిగి జీవన ఉపాధి వెతుక్కుంటాం బిందెలు బకెట్లు మాట్లు వేస్తాం కళాయి పనిచేస్తాం రాతెండి, ఇత్తడి కరిగించి విగ్రహాలు తయారు చేస్తాం కానీ కొత్త కొత్త టెక్నాలజీల వల్ల మా జీవన ఉపాధి కోల్పోయాం లేబర్ పనులు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటా బతుకుతున్నా మా జీవితాలకు ఎటువంటి భరోసా లేదు మా పిల్లలకు ఎటువంటి భరోసా లేదు కనీసం మాకు ఉండటానికి ఇల్లు , స్థలం కూడా లేదు. గుడిసెలు వేసుకుని ఉంటాం కనీసం మాకు రేషన్ కార్డు కూడా లేదు మాకు ఎటువంటి పథకాలు రావు వర్తించవు. కనీసం రేషన్ కార్డు కూడా ఇయ్యరా సార్ రెండుసార్లు కారు గుర్తుకే ఓటేశాం సార్ అయినా మాకు ఇప్పుడు దాకా ఇటువంటి పథకాలు రాలే కనీసం రేషన్ కార్డు కూడా రాలే ఉపాధి కోల్పోయిన సంచార ముస్లిమ్స్ మాకు ఎటువంటి గుర్తింపు లేదు రేషన్ కార్డ్ కూడా లేదు ఆధార్ కార్డు తప్పితే ఏళ్ల తరబడి మా జీవితాలు ఇలానే కొనసాగుతున్నాయి ఇప్పుడు మా పిల్లల జీవితాలు కూడా అలానే ఉండాలా.
ఇది సగటు సంచార జీవుడి కథ వ్యథ , వీరి సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పధకాల రూపకల్పన జరిగితే తగిన న్యాయం చేసినవాళ్ళం అవుతాము .


