
Motion of no confidence
ఉమ్మడి కరీంనగర్ లో కాకరేపుతున్న అవిశ్వాస తీర్మానాలు. జగిత్యాల, రామగుండం, తాజాగా హుజురాబాద్ మున్సిపాలిటీలో అసమ్మతి రాగం రాజుకుంది. చడీ చప్పుడుకాకుండా నిన్న హుజురాబాద్ లో 25 మంది కౌన్సిలర్లు సమాలోచనలు జరిపి చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులకు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. దీంతో మరో మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలో ముసలం మొదలైనట్టయింది.
రాష్ట్రవ్యాప్తంగా సైతం మున్సిపాలిటీలలో ముసలం మొదలవుతున్నట్లు తెలుస్తోంది . రాజకీయ ప్రత్యర్థుల క్రీడలో భాగమా లేక ,తమకు వ్యతిరేకంగా పావులు కడుపుతున్నారనే సమాచారంతో అధికార పార్టీ నే ఈ కొత్త ఎత్తుగడ వేస్తోందా తెలియాల్సి ఉంది .
తదుపరి సిద్ధిపేట జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో సైతం కౌన్సిలర్లు తిరుగుబాటు చేయనున్నట్లు సమాచారం .

