నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్

యుధిష్ఠిర వార్త: సిద్దిపేట ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్ గారు తీవ్రంగా ఖండించారు:
ఈ సందర్భంగా అజ్మత్ గారు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు ఒక NSUI కళాశాల అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్రానికి మంత్రి కావడం జరిగింది ఆయనకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంది ఆయనకు విద్యార్థుల సమస్యలు అన్ని తెలుసు అని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు విద్యార్థులకు అన్యాయం చేసిన గురించి ఈరోజు మంత్రిగారు వినతి పత్రం కోసం వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులకు వివరించడం జరిగింది తప్ప విద్యార్థి సంఘాలను అవమానపరచలేదు అని అన్నారు

దాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు వేరే విధంగా పొన్నం ప్రభాకర్ గారిపై దుష్ప్రచారం చేయడం సరికాదు అని అన్నారు మరి మొన్నటికి మొన్న ప్రభుత్వం అన్ని హాస్టళ్లకు గురుకులాలకు 40 శాతం మిస్ కాస్మోటిక్ చార్జీలు కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది అని అన్నారు. మరియు తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించడం జరిగింది అని అన్నారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో 21 వేల కోట్లతో రెసిడెన్షియల్ స్కూలు కూడా ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ స్థలంలో 21 వేల కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ మంత్రిగారు శంకుస్థాపన చేయడం జరిగింది అని అన్నారు .మరియు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాదాపు 50000 వేలు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అని అన్నారు అప్పటి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేసింది అని అన్నారు మా ప్రభుత్వం విద్యార్థులకు కట్టుబడి ఉంది అని అన్నారు గత ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఉంచడం జరిగింది అని అన్నారు మేము అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది అని అన్నారు అయినా కూడా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరుగుతుంది అని అన్నారు ప్రజా పాలనలో మంత్రులకు స్వయంగా అన్ని సంఘాలు కలిసి అవకాశం ఉంది అని అన్నారు
అప్పటి ప్రభుత్వంలో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని అన్నారు విద్యార్థి సంఘాలు ఒక సారి ఆలోచించుకోవాలని అన్నారు విద్యార్థుల విషయంలో గానీ నిరుద్యోగుల విషయంలో గానీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని అన్నారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిద్దిపేట జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు వహాబ్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సలీం NSUI జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మత్ అలీ NSUI పట్టణ అధ్యక్షుడు సాయి ప్రతాప్ NSUI నాయకులు నవాజ్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు