ఓ స్త్రీ మూర్తి మార్పు నీతోనే సాధ్యం

ఓ స్త్రీ మూర్తి మార్పు నీతోనే సాధ్యం

RAMESH POTHARAJU:

ఏడాదికోసారి వచ్చే మహిళా దినోత్సవం మళ్ళీ వచ్చింది ., మగువా మగువా అని స్టేటస్ లు పెట్టేందుకు యావత్ పురుషలోకం సన్నద్ధం అయ్యింది . ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటూ , మహిళల గురించి ఒక్కరోజే ఉపన్యాసం దంచికొట్టేందుకు మేధావిలోకం మెదళ్ళకు పదునుపెడుతోంది …

కానీ ఎక్కడో నాకు మాత్రం స్టేటస్ పెట్టేందుకు సిగ్గుగా అనిపిస్తోంది , ఏం సాధించామని , ఏం మారిందనే రకరకాల ప్రశ్నలే నా వెంట పడుతున్నాయి . మహిళా మూర్తులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం మాత్రం శూన్యం .

వ్యవస్థలో మార్పు అవసరమా ? వ్యక్తిలో మార్పు రావాలా ? అసలు ఈ వ్యవస్థ అంటేనే వ్యక్తులు కదా ?? కరోనా మహమ్మారికి భయపడి ముందస్తుగా టీకా వేసుకుంటున్న మనం , అంతకన్నా భయంకరమైన , ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఈ లింగ వివక్షకు , వికృత చేష్టలకు ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ..?

వ్యక్తిగా నాకు కనిపిస్తున్న పరిష్కారం మల్లి స్త్రీనే., అవును ప్రతీ ఇంటిలో ప్రతీ తల్లి తమ బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చి దిద్దడం తో పాటు ,మహిళ అంటే ఒక బ్రహ్మ పదార్ధం అనే విధంగా భ్రమలు కలిగించకుండా , స్త్రీ పురుషభేదాలు లేకుండా కొడుకుని కూతుర్ని పెంచగలిగిన నాడు , అవసరం అయితే తప్పు చేస్తే ,తప్పటడుగులు వేస్తుంటే, తానే కఠినమైన చట్టంగా మారి, శిక్షించగలిగిన నాడు ఎంతో కొంత మార్పు సాధ్యం అనిపిస్తోంది.

కాదు మీతో అంగీకరించను అనే వాళ్ళు , చట్టాలతో ఇప్పటివరకు జరిగిన మార్పు ఎంత చెప్పగలరా ?

కొత్త చట్టం చేసిన ప్రతిసారి ఇక నుండి మార్పు వస్తుందనే ఆశతోనే కదా చేసేది ? వ్యక్తి భాగస్వామ్యం ఉన్ననాడే ఏ చట్టం అయినా శాసనం అయినా నిలబడేది సత్ఫలితాలను ఇచ్చేది…

రండి స్త్రీలను కాపాడుకునే శక్తి , అవకాశం స్త్రీ చేతిలోనే ఉంది. స్త్రీ రక్షణ చట్టాల్లో మహిళల ప్రాధాన్యత పెంచే దిశగా అడుగులు వేద్దాం !

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *