
Reporter Prashanth:
ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో సాగుతున్నాయి ఆధునిక మానవుడి జీవితాలు, ఉరుకులు పరుగుల జీవితంలో సాటిమనిషికి కాస్తంత సాయం అనే మాటే వినబడటంలేదు, జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న జీవితాల మధ్య ఆధునిక పోకడలను అందుకోలేక నత్తనడకన సాగుతున్న జీవితాలూ కొన్ని ఉంటాయ్.

అక్కడక్కడా కనిపించే ఇలాంటి దృశ్యాలు ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
సిద్దిపేట పట్టణం విక్టరీ చౌరస్తాలో విధుల్లో నిమగ్నమైన పోలీసు ,. రోడ్డు దాటలేక, సిగ్నల్ వ్యవస్థ అర్ధం కాక అయోమయంలో ఉన్న వృద్ధురాలును జాగ్రత్తగా రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు
NOTE: చిన్న సాయానికే పెద్ద వార్త అని అనిపించేవారు, ఒక్క సారి మీ పని వదిలేసి, ఒక్క 5నిమిషాలు సమయం కేటాయించి సాయం చెయ్యండి తెలుస్తుంది.

