బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తో రజకసంఘాల నాయకుల భేటీ పలు అంశాలపై వినతులు

తెలంగాణ రజక సంఘాల కమిటీ బస్వరాజు సారయ్య మరియు బస్వరాజు శంకర్ గారి ఆధ్వర్యం లో బీసీ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ను రజక సంఘం నాయకులు కలిశారు. ఈ సంధర్బంగా
రజక ఆత్మ గౌరవ భవన్ నిర్మాణం నిమిత్తం గత ప్రభుత్వం మేడిపెల్లి లో కేటాయించిన స్థలాన్ని
ఉప్పల్ బగాయత్ కు మార్చడంతో పాటు, 102 గవర్నమెంట్ సంస్థలలో రజకవృత్తి ని రజకులు చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
వెంటనే మంత్రి గారు మేడ్చల్ కలెక్టర్ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమము లో పంజాగరి ఆంజనేయులు కొన్నే సంపత్,
కోట్ల శ్రీనివాస్ ,అక్కేన పల్లి రమేష్ ,పెద్దాపురం కుమార స్వామి, దుబ్బాక రమేష్, పెద్దవురే బ్రహ్మయ్య, ou గంగాధర్, పోతరాజు రాములు, వెంకటేష్, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు .


