ఒక్కసారిగా ఈ దృశ్యం నా చిన్నప్పటి జ్ఞాపకాలను అదృశ్యం చేస్తున్నట్టుగా అనిపించింది., సిద్దిపేట మొదలుకుని రామయంపేట్ వరకూ దారిపొడవునా అడుగడుగునా పలకరించే మర్రి చెట్లు మాయమైపోతున్నాయి. బాటసారులను కడసారి పలకరిస్తూ నేలకొరుగుతున్నాయి మహావృక్షాలు.

ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ రహదారి విస్తరణలో భాగంగా ఈ వృక్షాలను తొలగిస్తున్నారు. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ చెట్లు కనుమరుగవుతుండటం బాధ కలిగించినా,జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న మనిషి జీవితానికి ఈ ప్రగతి, పట్టణీకరణ అనేది నిరంతర ప్రక్రియగా మారింది.

