Selfish Resignation/ఎవరి తీర్పు ఎవరి నిర్ణయం ?

RAMESH POTHARAJU:

ఓ ఓటరు ఓటు హక్కు లేనోడే నీకన్నా బెటరు .

పనికి చెడి, ప్రయాస పడి ఓటు వేస్తావ్ . మరి నువ్వు ఎన్నుకున్నోడు ఎన్ని దినాలు ఆ పదవిలో ఉంటాడో నీకు తెలుసా ?
నిన్ను మళ్ళీ పోలింగ్ బూతు ముందు వరసలో ఎప్పుడు నిలబెడుతాడో నీకు తెలుసా ?

ఆయనగారికి వేరే పార్టీ నుండి ఆఫర్ వస్తే రాజీనామా !
ఆయన గారికి బోర్ కొట్టినా,కాంట్రాక్టులు దక్కకపోయినా రాజీనామా !
రాజీనామా కారణానికి కాదేది అనర్హం ..?

అయిదు సంవత్సరాలకని అయిదు వేళ్ళు నోట్లోకి పోయేలా చేస్తాడని నువ్వు తీసుకున్న నిర్ణయం , ఆయనకు పెట్టిన కిరీటం , పక్కకు పెట్టడానికి ఆయన తీసుకునే సమయం కేవలం అయిదు నిమిషాలు . అది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు అంటారా ? అది వేరే చర్చ . ఎంత వెసులుబాటు ఉన్నా, లైఫ్ లైన్ వాడుకోవాలి గానీ ప్రజల లైఫ్ ని తాకట్టు పెట్టి మరీ వాడుకోకూడదు .

ఎన్నికల పేరుతో ప్రజాధనం ,సమయం వృధా చేయడం మాత్రమే కాకుండా , తాయిలాల రూపంలో మద్యం ఏరులై పారిస్తూ ప్రజల ఆరోగ్యాలను సైతం పాడు చేస్తున్నారు.

యువతను పెడదోవ పట్టిస్తూ , రాజకీయాల మీద వాళ్ళ అభిప్రాయాలను మార్చేస్తూ ,ప్రజాసేవకు యువరక్తాన్ని దూరం చేస్తున్నారు .


ఇప్పుడు చెప్పు ఓటరు ..మీలో ఎవరు బెటరు ? ఓటు హక్కు మాత్రమే కల్గిన నువ్వా ? నీ మీద సర్వహక్కులు కలిగినట్లు ప్రవర్తించే నాయకుడా ?

మును”గోడు” ఒక్క నియోజకవర్గానిదే కాదు.. మనందరి “గోడు” ఉప ఎన్నికలు వస్తే జరిగేది అభివృద్ధి కాదు వాళ్ళు కుమ్మరించేవి నిధులు కావు.. నిప్పుల మీద నీళ్ళు మాత్రమే… చివరికి మిగిలేది బూడిద మాత్రమే..

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *