మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తే కనీసం మర్యాదలు పాటించరా

అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని గ్రహించాలి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్

సిద్దిపేట జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో పర్యటించినప్పుడు కనీసం వచ్చి కలవాలన్న కనీస మర్యాద పాటించలేదని ఇంకా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు అధికారులు భ్రమలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ దాసరి రాజు.మండిపడ్డారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలు తీర్పును ఇచ్చారని అన్నారు.

SIDDIPET CONGRESS PARTY OFFICE

అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లుగా వ్యవహరించడం మానుకోవాలని సూచించారు. కొందరు అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా పని చేశారని ఇకనైనా ప్రభుత్వ అధికారులుగా పని చేయాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వచ్చి కలిసారని కానీ పోలీసు అధికారులు మాత్రం ఇంతవరకు కలవకపోవడం బాధాకరమని అన్నారు. పెద్ద పెద్ద చదువులు చదవడం గొప్పకాదని కనీసం మర్యాదలు పాటించడం కూడా నేర్చుకోవాలని దాని వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఓర్వలేని అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించకుంటే దయచేసి జిల్లా నుంచి బదిలీ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పాలు పంచుకోవాలని ప్రభుత్వానికి సహకరించి మీ వంతు సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ కోఆర్డినేట్ దాసరి రాజు మైనార్టీ జిల్లా అధ్యక్షులు మజార్ మలిక్. పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు పట్టణయువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్. ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రశాద్. ఆయ్యుబ్. ఫాయాజ్. తదితరులు పాల్గొన్నారు

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *