ఘనంగా సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ సూచన మేరకు సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి వేడుకల్లో భాగంగా కాకే కటింగ్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు న్యాయవాదులు న్యాయవాదుల సంక్షేమం, మరియు హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్లు రూపాయలు కేటాయించడాన్ని హర్శిస్తూ ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల్లో సిద్దిపేట జిల్లా డిసిసి లీగల్ సెల్ చైర్మన్ జీవన్ రెడ్డి, నాయకులు ఆత్మరాములు, మీసం నాగరాజు, ch కనకయ్య, భైరి ప్రవీణ్ కుమార్, రాజకుమార్, నరేష్, నగేష్ మరియు సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది ఏ బాపురావు మరియు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

