RAMESH POTHARAJU:
స్వయం పాలనలో సర్వస్వం స్వాహా చేస్తోంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం.
నీతి ఆయోగ్ లో నీతి లేదని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీ ప్రభుత్వం లో ఉన్న నీతిపరులు ఎందరో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది…
కుల వృత్తులను కాపాడుకోవాలని కథలు చెప్పే ముఖ్యమంత్రి వారికి అందుతున్న ప్రోత్సాహకాలలో , గుర్తింపు లో జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి ఆరా తీస్తే బాగుంటుంది.
ఇక్కడ ఎక్సైజ్ అధికారుల దోపిడీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి,. అందినకాడికి దోచుకుంటూ ఆస్తులు సైజ్ పెంచుకుంటున్నారు.
కల్లు గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఇచ్చే T.C.S లైసెన్స్ (గుర్తింపు కార్డు) జారీ లో సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు. అది మరెక్కడో కాదు మన చిన్నకోడూర్ మండలంలోనే.
వసూళ్లు చేసి జారీ చేసిన కార్డులను సైతం , మీడియాలో ఫోకస్ అవ్వడం కోసం మంత్రిగారి చేతుల మీదుగా ఫార్మాలిటీ కి అందజేసి , తిరిగి వెనక్కి తీసుకోవడంతో, అయోమయంలో పడటం లబ్దిదారుల వంతైంది.
ఆ అధికారుల వెనక ఎవరు ఉన్నారో ? వసూళ్లు స్థానిక బడానేతకు వెళ్తున్నాయో ? స్థానిక MLA కు మినిస్టర్ కి వెళ్తున్నాయో ?
ఆ మహిమగళ్ల తల్లి యెల్లమ్మ తల్లికే ఎరుక..


