RAMESH POTHARAJU:
ఉదయించే సూర్యుడే కాదు, ఉదయాన్నే ఇలా తాను మురికి కూపంలోకి వెళుతూ మన ఆరోగ్యం కోసం పాటుపడే సఫాయి కూడా దేవుడే మరి
బార్డర్లో కాపుకాసే సిపాయి ,, ఇంటి ముందు కష్టపడే సఫాయి ఇద్దరూ సమానమే..
మలినాల్లో మెదులుతూ తన ఆయువు తగ్గించుకుంటూ మన ఆయుష్షు పెంచుతూ ముందుకు సాగే నిస్వార్థ జీవి ఈ సఫాయి…
సభలు జరిగాక సఫాయి, సంతార్పణ జరిగిగాక సఫాయి, పూజలు జరిగాక సఫాయి,
ఎవరైనా జరిగిపోతే సఫాయి, ఏదైనా జరిగితే సఫాయి….
ఇలా అన్ని విషయాల్లో సఫాయి పాత్ర చివర్లోనే….. ఎక్కడా ఏదీ ముందుగా ఆశించడు. అయినా ఎందుకో ఈ సమాజానికి చిన్న చూపు…
ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి… మీరు చిన్న చూపు చూస్తే అతనికి అలవాటైన జీవితమే… అదే అతను చిన్నగా చూసి సేవ చేయడం మరిస్తే…… ప్రకృతి కన్నెర్ర జేసినట్టే….
ఇప్పటికే మీ మనసులు చెత్తకుండి, అటుపై మీ జీవితాలే చెత్తకుండీల్లా మారుతాయ్…


