సిబిసి, హైదరాబాద్ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి), హైదరాబాద్, గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్రం, కోటి సహకారంతో ఈరోజు హైదరాబాద్‌లోని కోటిలో “10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం” వేడుకలను నిర్వహించారు. యోగాను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన వేడుకల్లో పలువురు యోగా ప్రియులు, శిక్షకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ జ్ఞాన మందిరం యోగా కేంద్రం డైరెక్టర్ రవీంద్ర కపాడియా మాట్లాడుతూ.. అన్ని వయసుల వారు మంచి ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు.
యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ’ అనే ఈ ఏడాది యోగా డే ఇతివృత్త సారాంశాన్ని వివరిస్తూ, ఆరోగ్యవంతులతో కూడిన దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి పౌరుడు యోగా సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దేశ అభివృద్ధికి దోహదడపడతాం అని సిబిసి, హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు అన్నారు.
పి.వి.ఎస్. శాస్త్రి, DDO & సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యోగాను అభ్యాసం చేసిన తర్వాత వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడిన వ్యక్తులను ఉదహరిస్తూ యోగా యొక్క ప్రాముఖ్యత గురించి సభకు అవగాహన కల్పించారు.

సీనియర్ యోగా గురువు మహేష్ ప్రసాద్ యోగా సెషన్‌ను నిర్వహించారు, ఇందులో పలువురు యోగా ఔత్సాహికులు, శిక్షకులు మరియు సిబిసి సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.సీబీసీ ఆధ్వర్యంలో యోగ పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు, పాల్గొన్న వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు మరియు బహుమతులను అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు, Sr AO పి.వి.ఎస్. శాస్త్రి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, CBC, S.L.P. రాజు, రవీంద్ర కపాడియా గారు అందజేశారు.
జూనియర్స్ విభాగంలో సెయింట్ ఆడమ్స్ హైస్కూల్‌కు చెందిన హరి చందన్ ప్రథమ బహుమతి సాధించగా, జీఎంపీఎస్, అలియాకు చెందిన సస్వత్, జీఎంహెచ్‌ఎస్, అలియాకు చెందిన శివేష్ మిశ్రా ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.

సీనియర్స్ విభాగంలో ఆర్.గాయత్రి ప్రథమ బహుమతి, యోగా టీచర్ పి.రాధిక ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని యోగా గురువు పి.రవి గెలుచుకున్నారు.
కరీనా బి. తెంగమం, డిప్యూటీ డైరెక్టర్, తరుణ్ కుమార్ బోడా, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, CBC, హైదరాబాద్ సిబ్బంది పాల్గొన్నారు.

