RAMESH POTHARAJU:
శిభి చక్ర వర్తి గురుంచి విన్నాం కదా ! ఇప్పుడు దాదాపు అలానే తనకు తోచిన సహాయం చేస్తూ అందరిని మనసుల్ని గెలుచుకుంటున్నాడు అభినవ చక్రవర్తి , చక్రధర్ గౌడ్ . రైతే రాజు అని ప్రగల్భాలు పలికి ఆ రైతులను వంచిస్తున్న నాయకులు ,ప్రభుత్వాలు , రైతు వద్దే లంచాలు తీసుకుంటున్న బిచ్చగాళ్ల లాంటి అధికారులు ఉన్న ఈ సమాజం లో ,, రైతే తన మొదటి ప్రాధాన్యతగా , ఆత్మహత్యలు చేసుకున్న ఎంతోమంది రైతు కుటుంబాలకు FarmersFirstFoundation ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు .
సంవత్సరం క్రితం తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన 200 మంది రైతుల కుటుంబాలకు అక్షరాల 200 మంది రైతులకు, ఒక్కొక్క కుటుంబానికి తలా లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేశారు. ఇప్పుడు మరలా తెలంగాణా ఆత్మహత్యలు చేసుకున్న మరో 100 మంది రైతుల కుటుంబాలకు సిద్దిపేట లొ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల సాయం చేశారు.
దేవుళ్ళు మన మధ్యే ఉంటారు అనడానికి ఇలాంటి వారే ఉదాహరణ.


