కార్యకర్తలకు అండగా కాంగ్రెస్

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గొల్లపల్లి చిన్న కిష్టయ్య గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది,కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి బాధలో ఉన్న ఆ కుటుంబానికి రాజీవ్ గాంధీ ప్రమాద భీమా ద్వారా ఆర్థిక భరోసాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అందజేశారు.

ఈ సందర్భంగా అజ్జు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు పునాది కార్యకర్త.పార్టీ జెండాను,ఎజెండాను భుజాలపై మోస్తూ,జనం గుండెల్లో నిలిపేవాడు కార్యకర్త.అలాంటి కార్యకర్తకు కష్టం వస్తే కన్నతల్లి లాంటి పార్టీ ఆదుకోవాలన్న ఉద్ధేశంతో ప్రమాద భీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిందని .పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్త ప్రమాదవశాత్తు ప్రాణం వదిలితే తన కుటుంబానికి కొంతైనా అండగా ఉండేందుకు రూ.2 లక్షల బీమా కలిపిస్తున్నారని తెలిపారు.

అలా ప్రమాద వశాత్తు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు యువ సంఘర్షణ సభ సందర్భంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని .అభివృద్ధి,సంక్షేమంతో పాటు పార్టీ పటిష్టత కోసం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానాని,మండలంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు .

కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోయి బాధలో వున్న కుటుంబాలకు రాజీవ్ గాంధీ ప్రమాద భీమా ద్వారా ఆర్థిక భరోసాను నా ద్వారా కల్పించడం చాలా ఆనందంగా ఉందని .ఇంత పెద్ద అవకాశం కొందరికే వస్తుంది.అలాంటి అవకాశం నాకు ఇప్పించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుంకుంటా నర్సారెడ్డి, ఇన్సూరెన్స్ & క్లెయిమ్స్ చైర్మన్ పవన్ మల్లాది,ఎన్ను శ్రీకాంత్ రెడ్డి,సైదయ్య బాబులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *